30లోగా మహిళలకు పర్మినెంట్‌ కమిషన్‌

భారతీయ సైన్యంలో మహిళా అధికారులకు నిర్దేశించిన విభాగాల్లో పర్మినెంట్‌ కమిషన్‌ను మంజూరు చేయడంపై సుప్రీం కోర్టు మరోమారు స్పందించింది. 30 రోజుల్లోపు అర్హులకు పర్మినెంట్‌ కమిషన్‌ ఇవ్వాలని పేర్కొంది.

Updated : 21 Dec 2022 16:46 IST

 గడువు విధించిన సుప్రీం 

దిల్లీ: భారతీయ సైన్యంలో మహిళా అధికారులకు నిర్దేశించిన విభాగాల్లో పర్మినెంట్‌ కమిషన్‌ను మంజూరు చేయడంపై సుప్రీం కోర్టు మరోమారు స్పందించింది. 30 రోజుల్లోపు అర్హులకు పర్మినెంట్‌ కమిషన్‌ ఇవ్వాలని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేయాలని గడువు విధించింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులో అంశాలు మొత్తాన్ని అమలు చేయడానికి ఆరునెలల సమయం కావాలని కేంద్రం కోరింది. కొవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఈ మినహాయింపు ఇవ్వాలని కోరింది. 
సైన్యంలో మహిళలకు పర్మినెంట్‌ సర్వీసు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17 తీర్పు ఇచ్చింది. నిర్ణీత విభాగాల్లో కమాండింగ్‌ అధికారిగా పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశించింది.  దీనికి సంబంధించిన పేపర్‌ వర్క్‌ పూర్తయిందని ఇప్పటికే రక్షణ మంత్రిత్వ శాఖ న్యాయస్థానానికి వెల్లడించింది. ఆదేశాలు జారీ చేయడమే తరువాయి అని పేర్కొంది. దీంతో న్యాయస్థానం మరో 30రోజుల గడువు ఇచ్చింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని