Corona: ‘కొవిరక్ష’తో కరోనాకు దూరం
ఆయుర్వేద తైలాన్ని ఆవిష్కరించిన బెంగళూరు అంకుర సంస్థ
ఈనాడు డిజిటల్, బెంగళూరు: కరోనా సోకకుండా నివారించటంతో పాటు చికిత్సలోనూ ఉపకరించే ఆయుర్వేద ఉత్పత్తి ‘కొవిరక్ష’ను భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) అంకుర సంస్థ నూతన్ ల్యాబ్స్ మంగళవారం బెంగళూరులో ఆవిష్కరించింది. కర్ణాటక ఆయుష్ శాఖ అనుమతి పొందిన ఈ ఆయుర్వేద తైలాన్ని రజత భస్మం (సిల్వర్ కొలాయిడల్)తో పాటు పలు వనమూలికలతో తయారు చేసినట్లు ఈ సంస్థ ప్రకటించింది. సెంటర్ ఫర్ నానో సైన్స్ ఇంజినీరింగ్ (సీఎన్‌ఎస్‌ఈ), టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ (టీబీఐ) సాంకేతిక సహకారంతో ఈ తైలాన్ని తయారు చేసినట్లు సంస్థ ప్రధాన పరిశోధకుడు హెచ్.ఎస్.నూతన్ తెలిపారు. ఈ తైలానికి గత వారం ఆయుష్ శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ‘ముఖంతో పాటు చేతులకు ఈ తైలాన్ని రుద్దితే మూడు గంటలు ప్రభావం ఉంటుంది’ అని సంస్థ ప్రకటించింది. ఐఐఎస్‌సీ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఆచార్యులు డాక్టర్ కిరుబా డేనియల్, నూతన్ ల్యాబ్స్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ వేణు శర్మ ఈ ఉత్పత్తిని ఆవిష్కరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
KTR: రానున్న రోజుల్లో ప్రపంచదేశాలకు భారత్ దిక్సూచి: కేటీఆర్
-
Movies News
Social Look: మహేశ్‌బాబు స్టైలిష్ లుక్.. తారా ‘కేకు’ వీడియో.. స్పెయిన్‌లో నయన్!
-
World News
Imran Khan: ర్యాలీలో వీడియో ప్లేచేసి.. భారత్‌ను ప్రశంసించిన ఇమ్రాన్ ఖాన్
-
General News
Andhra News: ప్రభుత్వ నిర్ణయంతో వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం
-
Movies News
Laal Singh Chaddha: ‘లాల్‌సింగ్ చడ్డా’ వీక్షించిన సీఎం మాన్.. ఏమన్నారంటే?
-
Politics News
Gorantla madhav: నాపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను చూస్తారు: గోరంట్ల
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?