Supreme Court: కారుణ్య నియామకాలు ఆటోమేటిక్‌ కాదు: సుప్రీంకోర్టు 

ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత వారిపై ఆధారపడినవారికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించడమనేది

Published : 17 Dec 2021 10:20 IST

దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత వారిపై ఆధారపడినవారికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించడమనేది ఆటోమేటిగ్గా జరిగిపోయేది కాదని, వేర్వేరు అంశాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి, కుటుంబంలోని ఇతర సభ్యుల వృత్తి-వ్యాపారాలు, మృతుని సంపాదనపై వారు ఎంతవరకు ఆధారపడ్డారు వంటి అంశాలన్నీ చూడాలని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఎలాంటి పరిశీలన లేకుండా ఈ ఉద్యోగాలు ఇచ్చేస్తే వాటిని ‘చట్టంలో ఉన్న హక్కు’గా భావిస్తారని వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాలను ఇలాంటి హక్కుగా ఎవరూ క్లెయిం చేయకూడదని చెప్పింది. ఒక వ్యక్తి కారుణ్య నియామకంపై కర్ణాటక పరిపాలన ట్రైబ్యునల్, అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అప్పీలుపై ధర్మాసనం తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాన్ని కొట్టివేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని