రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంపై వచ్చేవారం నివేదిక!

భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మరణానికి

Published : 02 Jan 2022 10:35 IST

దిల్లీ: భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా 13 మంది మరణానికి కారణమైన హెలికాప్టర్‌ ప్రమాదంపై నిర్వహించిన దర్యాప్తు దాదాపుగా పూర్తయింది. దానికి సంబంధించిన నివేదికను వచ్చే వారం వైమానిక దళ ప్రధాన కార్యాలయానికి సమర్పించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. భారీగా రూపొందిన ఈ నివేదికకు ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నట్లు పేర్కొన్నాయి. విమాన ప్రమాదాల దర్యాప్తులో విస్తృత నైపుణ్యమున్న ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో ఈ దర్యాప్తు కమిటీ ఏర్పాటైంది. రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణాలపై అన్ని కోణాలనూ ఈ బృందం పరిశీలించింది. దర్యాప్తు ప్రక్రియ మొత్తం న్యాయపరమైన విధివిధానాలకు అనుగుణంగా జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. గత నెల 8న తమిళనాడులోని కూనూరు తాలుకాలో ఈ హెలికాప్టర్‌ కూలిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని