తిరిగి విధుల్లోకి ‘మీసాల’ పోలీసు

‘సింహా’ సినిమాలో బాలకృష్ణ తరహాలో మీసం పెంచిన మధ్యప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేశ్‌ రాణాపై విధించిన సస్పెన్షన్‌ను ఉన్నతాధికారులు

Updated : 11 Jan 2022 12:53 IST

మధ్యప్రదేశ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

భోపాల్‌: ‘సింహా’ సినిమాలో బాలకృష్ణ తరహాలో మీసం పెంచిన మధ్యప్రదేశ్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేశ్‌ రాణాపై విధించిన సస్పెన్షన్‌ను ఉన్నతాధికారులు సోమవారం ఎత్తివేశారు. రాణాపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ఏఐజీ ప్రశాంత్‌ శర్మకు అతడిని తప్పించే అధికారం లేదని స్పష్టంచేశారు. సస్పెన్షన్‌ ఎత్తివేతతో రాకేశ్‌ రాణా తిరిగి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోని మోటార్‌ వెహికల్‌ విభాగంలో డ్రైైవర్‌గా చేరనున్నారు. మెడ వరకు మీసాలు, జుత్తుతో రాణా విధులకు హాజరయ్యేవారని, వాటిని కత్తిరించుకోమని చెప్పినప్పటికీ వినకపోవడం వల్ల్లే సస్పెన్షన్‌ వేటు పడిందని ఏఐజీ ప్రశాంత్‌ శర్మ ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని