మత్తిచ్చి విమానంలో వన్యప్రాణుల తరలింపు

బ్యాంకాక్‌ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన వన్యప్రాణులను తీసుకొచ్చిన తమిళనాడుకు చెందిన ఒక మహిళతోపాటు నలుగురిని అధికారులు శనివారం అరెస్టు చేశారు.

Published : 29 Jan 2023 03:28 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: బ్యాంకాక్‌ నుంచి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన వన్యప్రాణులను తీసుకొచ్చిన తమిళనాడుకు చెందిన ఒక మహిళతోపాటు నలుగురిని అధికారులు శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి 14 పాములు, 4 కోతులను స్వాధీనం చేసుకున్నారు. అన్ని ప్రాణులకు మత్తిచ్చి బ్యాగేజ్‌లో ఉంచి తీసుకొచ్చారు. బ్యాంకాక్‌లో వీరు స్కానర్లకు దొరక్కుండా అక్కడి సిబ్బంది సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. నిందితులు వారి ఫాంహౌస్‌లలో పలు వన్యప్రాణులు, విదేశీ జంతువులు, పక్షులను పెంచుతున్నారని గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు