బాల్య వివాహాలపై ఉక్కుపాదం.. భయంతో మహిళ ఆత్మహత్య

అస్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై కఠినచర్యలకు ఉపక్రమించింది. ఈ కేసుల్లో 2,258 మందిని ఆ రాష్ట్ర పోలీసులు ఇప్పటిదాకా అరెస్టు చేశారు.

Updated : 06 Feb 2023 06:01 IST

స్సాం ప్రభుత్వం బాల్య వివాహాలపై కఠినచర్యలకు ఉపక్రమించింది. ఈ కేసుల్లో 2,258 మందిని ఆ రాష్ట్ర పోలీసులు ఇప్పటిదాకా అరెస్టు చేశారు. మంకాచార్‌ జిల్లాలోని ఝౌడాంగ్‌ పబెర్‌ గ్రామంలో ఉంటున్న ఖుష్బూ బేగంకు 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు పెళ్లి చేశారు. ఇప్పుడామెకు 22 ఏళ్లు.. ఇద్దరు పిల్లలు. 2019లో కొవిడ్‌తో భర్త చనిపోయాడు. రాష్ట్రంలోని తాజా పరిణామాల నేపథ్యంలో.. తనకు బాల్యవివాహం చేసినందుకు తల్లిదండ్రులను అరెస్టు చేస్తారనే భయంతో ఖుష్బూ శనివారం ఆత్మహత్య చేసుకొంది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు