అమ్మభాషను దూరం చేసుకోకండి

కేవలం ఒక భాషలో మాట్లాడితేనే గౌరవం వస్తుందన్న ఆత్మన్యూనతా భావాన్ని యువత వీడాలని పరోక్షంగా ఇంగ్లిషును ఉదహరిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

Updated : 19 Mar 2023 06:18 IST

మాతృభాషలోనే పరిశోధనలు చేయండి
యువతకు అమిత్‌ షా పిలుపు

వడోదరా(గుజరాత్‌): కేవలం ఒక భాషలో మాట్లాడితేనే గౌరవం వస్తుందన్న ఆత్మన్యూనతా భావాన్ని యువత వీడాలని పరోక్షంగా ఇంగ్లిషును ఉదహరిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ‘‘మీరు జీవితంలో ఏదైనా చేయండి. మాతృభాషకు మాత్రం దూరం కావొద్దు. ఒక వ్యక్తి తన అమ్మభాషలో పరిశోధన, విశ్లేషణ చేస్తే అతని సామర్థ్యం పెరుగుతుంది. సరైన తర్కంతో నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. మన దేశంలో భాషలకు అద్భుతమైన వ్యాకరణం, సాహిత్యం, కవిత్వం, చరిత్ర ఉంది. వాటికి మరింత హంగులు దిద్దితే తప్ప మన దేశ భవిష్యత్తును మెరుగుపరచలేం. అందుకే మాతృభాష తప్పనిసరి చేసే నూతన విద్యావిధానాన్ని ప్రధాని మోదీ తెచ్చారు’’ అని షా శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు