ఇంజినీరింగ్‌లో దిల్లీ ఐఐటీ భేష్‌.. ప్రపంచంలో 48వ స్థానం

ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి ప్రపంచంలోని 50 అత్యుత్తమ విద్యాసంస్థల్లో దిల్లీ ఐఐటీకి చోటు దక్కింది. గతేడాదితో పోలిస్తే 7 స్థానాలు మెరుగై 48వ ర్యాంకును సాధించింది.

Published : 23 Mar 2023 03:33 IST

క్యూఎస్‌ జాబితా విడుదల

దిల్లీ: ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించి ప్రపంచంలోని 50 అత్యుత్తమ విద్యాసంస్థల్లో దిల్లీ ఐఐటీకి చోటు దక్కింది. గతేడాదితో పోలిస్తే 7 స్థానాలు మెరుగై 48వ ర్యాంకును సాధించింది. ఈ మేరకు 2023కుగానూ సబ్జెక్టులు, విభాగాల వారీగా ఉత్తమ వర్సిటీల జాబితాను క్వాక్వరెల్లి సైమండ్స్‌(క్యూఎస్‌) సంస్థ బుధవారం విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. దేశంలోని 66 ఉన్నత విద్యా సంస్థల్లోని 355 సబ్జెక్టులు తొలి 100 ర్యాంకుల జాబితాలో నిలిచాయి.  గణితంలో బాంబే ఐఐటీ తొలి 100 స్థానాల్లో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 25 స్థానాలు ఎగబాకి 92వ స్థానాన్ని దక్కించుకుంది. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో కాన్పుర్‌ ఐఐటీ 87వ ర్యాంకు, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో 96వ ర్యాంకు సాధించింది. గణితంలో ఐఐటీ మద్రాస్‌ 50 స్థానాలు మెరుగై 98వ ర్యాంకు సాధించింది. ఈసారి క్యూఎస్‌ జాబితాలో మన దేశం నుంచి 27 సబ్జెక్టులతో దిల్లీ వర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది. తదుపరి స్థానాల్లో బాంబే ఐఐటీ(25), ఖరగ్‌పుర్‌ ఐఐటీ(23) నిలిచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని