నేర్చుకుంటూ సంపాదించండి.. ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులకు పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌

దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ‘నేర్చుకుంటూనే సంపాదించండి’ పథకం త్వరలో ప్రారంభంకానుంది.

Updated : 20 Apr 2023 08:26 IST

యూజీసీ ప్రతిపాదన

దిల్లీ: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ‘నేర్చుకుంటూనే సంపాదించండి’ పథకం త్వరలో ప్రారంభంకానుంది. తద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు తమ చదువులను కొనసాగించుకోవడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోగలుగుతారని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) తెలిపింది. ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల్లోని వివిధ విభాగాల్లో చేరిన విద్యార్థులకు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలను కల్పించడానికి సంబంధించిన ప్రతిపాదనలను యూజీసీ రూపొందించింది. వారానికి 20 గంటల పాటు నెలలో 20 రోజులు తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని, అందుకు ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని నిర్ణయిస్తూ ముసాయిదా మార్గదర్శకాలను యూజీసీ తయారు చేసింది. విద్యార్థుల సేవలు వినియోగించుకునేందుకు వీలుకల్పించే వాటి జాబితాలో రీసెర్చ్‌ ప్రాజెక్టులకు సహాయం పడటం, గ్రంథాలయాల్లో పనులు, కంప్యూటర్‌ సేవలు, డేటా ఎంట్రీ, ప్రయోగశాలల్లో చేయూతనందించడం వంటివి ఉన్నాయి. అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసి వారికి వంతుల వారీగా ఆయా పనులు కేటాయిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని