రాహుల్‌ అమెరికా పర్యటనకు మార్గం సుగమం

జూన్‌ మొదటివారంలో అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి కొత్త పాస్‌పోర్టు విషయంలో ఊరట లభించింది.

Published : 27 May 2023 05:26 IST

ఎన్‌వోసీకి కోర్టు అంగీకారంతో కొత్త పాస్‌పోర్టు

దిల్లీ:  జూన్‌ మొదటివారంలో అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి కొత్త పాస్‌పోర్టు విషయంలో ఊరట లభించింది. ‘సాధారణ పాస్‌పోర్టు’ కోసం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను శుక్రవారం దిల్లీ కోర్టు అంగీకరించింది. మూడేళ్ల కాలానికిగాను ఆయనకు ఎన్‌వోసీ జారీ చేసింది.  ‘మోదీ’ ఇంటిపేరు వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో తన దౌత్య హోదా పాస్‌పోర్టును ఆయన అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా సాధారణ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు.. భాజపా నేత సుబ్రమణ్యస్వామి ఫిర్యాదుతో నమోదైన నేషనల్‌ హెరాల్డ్‌ కేసులోనూ రాహుల్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో 2015 నుంచి ఆయన బెయిలుపై ఉన్నారు. దీంతో రాహుల్‌ ఎన్‌వోసీ పిటిషన్‌ను సుబ్రమణ్యస్వామి వ్యతిరేకించారు. ఆ వాదనలను న్యాయస్థానం తిరస్కరించింది. రాహుల్‌కు ఎన్‌వోసీ ఇచ్చేందుకు అంగీకరించింది. పదేళ్లకు కాకుండా.. మూడేళ్ల కాలానికి ఎన్‌వోసీ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని