ఇకపై ఓటీటీలోనూ పొగాకు హెచ్చరికలు

సినిమా థియేటర్లు, టీవీ కార్యక్రమాల్లో మాదిరిగా ఇకపై ఓటీటీలోనూ పొగాకు సంబంధిత హెచ్చరికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది.

Published : 01 Jun 2023 03:14 IST

దిల్లీ: సినిమా థియేటర్లు, టీవీ కార్యక్రమాల్లో మాదిరిగా ఇకపై ఓటీటీలోనూ పొగాకు సంబంధిత హెచ్చరికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు, మధ్యలో.. పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా కనీసం 30 సెకన్ల పాటు ప్రకటనను ప్రదర్శించాలని తెలిపింది. ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా బుధవారం ఈ మేరకు ‘సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం- 2004’లో నిబంధనల్ని సడలిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇలాంటి మార్పుచేసిన తొలి దేశంగా నిలిచింది. నిబంధనలు ఉల్లంఘించినవారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని