‘శాస్త్ర’లో యూనివర్సిటీ డే వేడుకలు

ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ అభయ్‌ జెరె సూచించారు.

Updated : 30 Apr 2024 07:05 IST

చెన్నై, న్యూస్‌టుడే: ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ అభయ్‌ జెరె సూచించారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని శాస్త్ర వర్సిటీలో నిర్వహించిన ‘యూనివర్సిటీ డే’ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని విద్యార్థులకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలని అన్నారు. అందుకనుగుణంగా ఉన్నత విద్యాసంస్థలు కృషిచేయాలని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులు, అధ్యాపకులకు పరిశోధక పురస్కారాలు అందించారు. 2023-24 వర్సిటీ వార్షిక నివేదికను ఉపకులపతి డాక్టర్‌ ఎస్‌.వైద్యసుబ్రమణ్యం చదివి వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని