ఐఐటీ మద్రాస్‌కు రూ.513 కోట్ల విరాళం

ఐఐటీ మద్రాస్‌ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్‌ సంచాలకులు ప్రొఫెసర్‌ వి.కామకోటి బుధవారం ప్రకటించారు.

Updated : 09 May 2024 05:54 IST

ఈనాడు-చెన్నై: ఐఐటీ మద్రాస్‌ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్‌ సంచాలకులు ప్రొఫెసర్‌ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. అదనంగా ఇంకో రూ.717 కోట్ల నిధులు ఇచ్చేందుకు వివిధ కార్పొరేట్‌ సంస్థలు, పూర్వ విద్యార్థులు ముందుకొచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తం నిధుల్ని సాంకేతిక పరిశోధన, విద్యాసంస్థ అభివృద్ధికి, విద్యార్థుల ఉపకారవేతనాలకు ఉపయోగించనున్నట్లు వివరించారు. నాలుగేళ్లుగా రూ.976.2 కోట్ల నిధులు ఐఐటీ మద్రాస్‌కు సమకూరాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని