JK: కశ్మీర్‌లో ఆస్తులు కొన్న బయటి వ్యక్తులెందరో వెల్లడించిన కేంద్రం

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక ఇప్పటివరకు ......

Published : 29 Mar 2022 16:15 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాక ఇప్పటివరకు అక్కడ 34మంది బయటి వ్యక్తులు ఆస్తులు కొనుగోలు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్‌ లోక్‌సభకు తెలిపారు. స్థానిక ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు 34 మంది జమ్మూకశ్మీర్‌ యేతర పౌరులు ఆస్తులు కొనుగోలు చేసినట్టు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఆస్తులు జమ్మూ, రియాసి, ఉదంపూర్‌, గందర్బల్‌ జిల్లాల్లో ఉన్నాయన్నారు. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదాను రద్దు చేయడంతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అప్పటివరకు అక్కడ బయటి వ్యక్తులు ఆస్తుల కొనుగోలుపై నిషేధాన్ని కూడా ఎత్తివేసింది. దీంతో ఇప్పటివరకు 34మంది బయట వ్యక్తులు అక్కడ ఆస్తులు కొనుగోలు చేశారని తాజాగా కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని