Mahua Moitra: మహువా మాజీ స్నేహితుడు దెహద్రాయ్‌కు సీబీఐ సమన్లు

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) మాజీ స్నేహితుడు జై అనంత్‌ దెహద్రాయ్‌కు సీబీఐ సమన్లు ఇచ్చింది. 

Updated : 23 Jan 2024 16:23 IST

దిల్లీ: లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారంటూ టీఎంసీ(TMC) నేత మహువా మొయిత్రా(Mahua Moitra)పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె మాజీ మిత్రుడు జై అనంత్ దెహద్రాయ్‌(Jai Anant Dehadrai)కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమన్లు ఇచ్చింది. గురువారం(జనవరి 25) ఆయన్ను ప్రశ్నించనుంది.

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె పార్లమెంట్ లాగిన్‌ వివరాలను దుబాయ్‌ నుంచి యాక్సెస్‌ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్‌ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే, న్యాయవాది దెహద్రాయ్‌ను కమిటీ విచారించింది.  నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు కమిటీ నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాక విచారణ ఎందుకు?

పశ్చిమ్‌ బెంగాల్‌కు చెందిన కొందరు పోలీసు అధికారులతో ఉన్న పరిచయాలతో మహువా తనపై అక్రమంగా నిఘా ఉంచారని డిసెంబర్‌లో దెహద్రాయ్‌ సీబీఐకి లేఖ రాశారు. తన ఫోన్‌ నంబర్‌తో, తాను ఎక్కడున్నాననే విషయాన్ని ట్రాక్‌ చేసే అవకాశం ఉందని ఆ లేఖలో ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు