Hanuman Chalisa Row: నవనీత్‌ దంపతులకు ఊరట.. బెయిల్ ఇచ్చిన ముంబయి కోర్టు

హనుమాన్‌ చాలీసా పఠన వివాదంలో అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు బెయిల్ మంజూరైంది.

Published : 04 May 2022 13:34 IST

ముంబయి: హనుమాన్‌ చాలీసా పఠన వివాదంలో అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు బెయిల్ మంజూరైంది. రెండు వర్గాల మధ్య మతకలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ ముంబయి పోలీసుల ఏప్రిల్ 23న రాజద్రోహం కింద వారిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. తాజాగా ఒక్కొక్కరికి రూ.50 వేల పూచీకత్తుపై న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చింది. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఇంటిముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరుతామంటూ ఇటీవల రాణా దంపతులు సవాలు విసిరారు. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు ఎంపీ ఇంటిముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. ఆ క్రమంలో ఏప్రిల్‌ 23న ముంబయిలో హైడ్రామా కొనసాగింది. ఆ పరిణామాల నేపథ్యంలో నవనీత్‌ దంపతులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అప్పుడు రవి రాణా మాట్లాడుతూ.. ముంబయిలో ప్రధాని పర్యటన ఉండటంతో దానికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో తాము వెనక్కి తగ్గుతున్నట్లు వెల్లడించారు. అయితే నవనీత్‌ దంపతులు విసిరిన సవాలు మత కలహాలకు దారితీసేలా ఉందంటూ ముంబయి పోలీసులు వారిని అరెస్టు చేశారు. తర్వాత వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని బాంద్రాలోని మెట్రోపాలిటన్ కోర్టు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని