Corona: మహారాష్ట్రలో 50 కొవిడ్‌ కేసులు నమోదు

మహారాష్ట్రలో కొత్తగా 50 కొవిడ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో తొమ్మిది కొత్త ఉపరకం కేసులే ఉన్నట్లు తెలిపింది.

Published : 24 Dec 2023 22:02 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా (Corona) మహమ్మారి కేసుల వివరాలను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కొత్తగా 50 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. వీటిలో తొమ్మిది కొత్త ఉపరకం జేఎన్‌.1 కేసులు ఉన్నట్లు ఆదివారం తెలిపింది.  తాజాగా నమోదైన కేసులతో మహారాష్ట్రంలో మూడేళ్ల క్రితం నుంచి ఇప్పటివరకు నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 81,72,135కి చేరిందని ఆరోగ్యశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన తొమ్మిది జేఎన్‌.1 రకం కేసులతో కలుపుకొంటే కొత్త ఉపరకం కేసుల సంఖ్య 10కి చేరినట్లు తెలిపింది. కొత్త వేరియంట్‌ సోకిన వారిలో ఠానే నగరంలో ఐదుగురు, పుణెలో ఇద్దరు కాగా.. పుణె జిల్లాలో ఒకరు, అకోలా సిటీలో ఒకరిలో  జేఎన్‌.1 వేరియంట్‌ గుర్తించినట్లు పేర్కొంది. అయితే, జేఎన్‌.1 వేరియంట్ సోకిన అందరూ కోలుకున్నారని వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని