మమతా బెనర్జీకి గాయం

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచార సమయంలో ఆమె కాలికి గాయమైంది. అయితే, తాను కారు ఎక్కుతుండగా కొందరు వ్యక్తులు తనను.....

Updated : 10 Mar 2021 19:48 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచార సమయంలో ఆమె కాలికి గాయమైంది. తాను కారు వద్ద నిల్చుని ఉండగా.. కొందరు వ్యక్తులు కారు డోరును బలంగా తోయడంతో తన కాలికి గాయమైందని మమత చెప్పారు. దీంతో కాలు వాపు వచ్చిందని తెలిపారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేశారు. ఆ సమయంలో స్థానిక పోలీసులెవరూ తన చుట్టూ లేరని పేర్కొన్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. గాయపడిన మమతను పార్టీ శ్రేణులు కోల్‌కతాకు తరలించాయి. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా బెనర్జీ కోల్‌కతా నుంచి మంగళవారం నందిగ్రామ్‌ చేరుకున్నారు. బుధవారం ఉదయం వివిధ దేవాలయాల్లో పూజల అనంతరం హల్దియాలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ రాత్రికి నందిగ్రామ్‌ నియోజకవర్గంలోనే బస చేయాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె పర్యటన అర్ధంతరంగా ముగిసింది. నందిగ్రామ్‌ నుంచి భాజపా తరఫున సువేందు అధికారి పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని