parliament: మావోయిస్టుల దాడులు 70శాతం తగ్గాయి: కేంద్రమంత్రి

దేశంలో మావోయిస్టుల దాడులు 2009తో పోలిస్తే 70శాతం వరకు తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2009లో మావోయిస్టులు మొత్తం 2,258 హింసాత్మక దాడులకు పాల్పడితే.. 2020 నాటికి ఆ సంఖ్య 665కి తగ్గిందని చెప్పారు. దేశంలో మావోయిస్టుల దాడుల గురించి భాజపా

Published : 01 Dec 2021 23:27 IST

దిల్లీ: దేశంలో మావోయిస్టుల దాడులు 2009తో పోలిస్తే 70శాతం వరకు తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభలో వెల్లడించారు. 2009లో మావోయిస్టులు మొత్తం 2,258 హింసాత్మక దాడులకు పాల్పడితే.. 2020 నాటికి ఆ సంఖ్య 665కి తగ్గిందని చెప్పారు. దేశంలో మావోయిస్టుల దాడుల గురించి భాజపా ఎంపీ విజయ్‌ పాల్‌ సింగ్‌ తోమర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానంద లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

‘‘భద్రతా దళాలపై, సామాన్య ప్రజలపై వామపక్ష తీవ్రవాదులు దాడులకు పాల్పడుతుంటారు. ప్రజా ఆస్తులను లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తారు. అయినప్పటికీ 2009తో పోలిస్తే దాడులు 70శాతం తగ్గాయి. అలాగే, మావోయిస్టుల దాడుల్లో పౌరులు.. భద్రత బలగాల మరణాలు కూడా 80శాతం తగ్గాయి. 2010లో నమోదైన మృతుల సంఖ్య 1005 ఉండగా.. 2020లో ఆ సంఖ్య 183గా ఉంది’’అని కేంద్రమంత్రి వివరించారు. భౌగోళికంగా మావోయిస్టు దాడులు చోటుచేసుకునే ప్రాంతాలను కట్టడి చేసినట్లు నిత్యానంద చెప్పారు. 2013లో పది రాష్ట్రాల్లోని 76 జిల్లాల్లో మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు.. వారిని తొమ్మిది రాష్ట్రాల్లోని 53 జిల్లాలకి పరిమితం చేశామని కేంద్రమంత్రి సభకు తెలిపారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని