PM Modi: కేంద్రం నిధులిస్తేనే..రాష్ట్రాల అభివృద్ధి: స్టాలిన్‌

రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని ప్రధాని మోదీ (PM Modi)ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Stalin) కోరారు. కాగా, తమిళనాడులో రూ.5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఇవాళ మోదీ శంకుస్థాపనలు చేశారు. 

Updated : 08 Apr 2023 23:58 IST

చెన్నై: దక్షిణాది పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (PM Modi) తమిళనాడులో దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా చెన్నై-కోయంబత్తూరు వందేభారత్‌ (Vande Bharat) రైలును ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రానికి నిధులు కేటాయించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు. తాజాగా రూ.5వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసినప్పటికీ మరిన్ని నిధులు కావాలని కోరుతున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తమిళనాడు అభివృద్ధి కోసం కేంద్రం చేస్తున్న కృషిని మోదీ నొక్కి చెప్పారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భారత్‌ విప్లవాత్మక అభివృద్ధిని చూస్తోందని మోదీ అన్నారు. దీనికోసం తాజా బడ్జెట్‌లో రికార్డు స్థాయిలో రూ.10 లక్షల కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇది 2014 బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే 5రెట్లు ఎక్కువగా అని అన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి సకాలంలో నిధులు వచ్చినప్పుడే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పెంచాలని ప్రధానిని అభ్యర్థించారు. చెన్నై-మధురవాయల్‌ ఎక్స్‌ప్రెస్‌వే, చెన్నై- తాంబరం ఎలివేటెడ్‌ కారిడార్‌, చెన్నై-మధురై జాతీయ రహదారిని ఆరు లైన్ల విస్తరణ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని