Modi: మీ వైఖరితో పార్లమెంట్, ప్రజల్ని అవమానిస్తున్నారు
పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా అడ్డుకుంటోన్న విపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రతిపక్షాల వైఖరిని తప్పుపట్టారు. ‘ఇది పార్లమెంట్, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజలను అవమానించడమే అవుతుంది’ అంటూ దుయ్యబట్టారు.
పార్లమెంట్‌లో విపక్షాల వైఖరిపై మోదీ అసహనం
దిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా అడ్డుకుంటోన్న విపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రతిపక్షాల వైఖరిని తప్పుపట్టారు. ‘ఇది పార్లమెంట్, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజలను అవమానించడమే అవుతుంది’ అంటూ దుయ్యబట్టారు.
జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. వాటికి ముందే పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతోపాటు రైతు చట్టాలు, తదితర అంశాలపై చర్చ జరపాలని విపక్ష పార్టీలు నిరసన చేపడుతున్నాయి. దాంతో సమావేశాలు ప్రారంభమైన దగ్గరి నుంచి ఉభయసభల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. విపక్షాల తీరుపై మోదీ ఇప్పటికే ఒకసారి అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో చర్చకు ఆసక్తి చూపకపోగా.. కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించడం లేదని విమర్శించారు. విపక్షాలు పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడంతో ఇప్పటికే రూ.130 కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్