Nepal: ప్రధానిగా ప్రమాణం చేయను: దేవ్‌ బా !

ప్రధానిగా ఎంపికైన నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బా (74) ప్రమాణస్వీకారం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ జారీ చేసిన నియామక పత్రంలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ కింద తనను ప్రధానిగా నియమించారో వెల్లడించలేదని ఆయన అన్నట్లు తెలిసింది...

Published : 13 Jul 2021 22:16 IST

కాఠ్‌మాండూ: ప్రధానిగా నియమితులైన నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహుదూర్ దేవ్‌బా (74) ప్రమాణస్వీకారం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ జారీ చేసిన నియామక పత్రంలో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ కింద తనను ప్రధానిగా నియమించారో వెల్లడించలేదని ఆయన అన్నట్లు తెలిసింది. నియామక పత్రంలో మార్పులు చేస్తేనే ప్రమాణస్వీకారానికి అంగీకరిస్తానని చెప్పినట్లు సమాచారం. ఐదోసారి నేపాల్‌ ప్రధానిగా నియమితులైన షేర్‌ బహుదూర్‌ దేవ్‌ బా బుధవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76(5) ప్రకారం ప్రధానిని నియమిస్తూ నేపాల్‌ రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో దేవ్‌బా పార్లమెంట్‌లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దేవ్‌బా గతంలో నాలుగుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేవ్‌బాను ప్రధానమంత్రిగా నియమించాలని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రపతి బిద్యా దేవి భండారీని సోమవారమే ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి చోలేంద్ర షంషేర్‌ రాణా ఆధ్వర్యంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫార్సు మేరకు ప్రతినిధుల సభను అధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. జులై 18న ప్రతినిధుల సభ సమావేశాన్ని జరపాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని