Rajya Sabha: తొమ్మిది మంది ఎంపీల ప్రమాణస్వీకారం

కేంద్రమంత్రి జైశంకర్‌తో పాటు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులతో ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్కడ్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

Published : 21 Aug 2023 19:51 IST

దిల్లీ: గత నెలలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు తొమ్మిది మంది ఎంపీలు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్‌ హౌస్‌లో రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగ్దీప్‌ ధన్కడ్‌ వీరందరితో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో భాజపా నుంచి జైశంకర్‌, బాబుభాయ్‌ దేశాయ్‌, కేసరీ దేవ్‌సింగ్‌ ఝాలా (గుజరాత్‌), నరేందర్‌ రాయ్‌ (పశ్చిమబెంగాల్‌) ఉండగా.. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి  డెరెక్‌ ఓబ్రియెన్‌, డోలా సేన్‌, సుఖేందు శేఖర్‌ రాయ్‌, ప్రకాశ్‌ చిక్‌ బారాయిక్‌, సమిరుల్‌ ఇస్లామ్‌ ఉన్నారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి  కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, రాజ్యసభ జనరల్‌ సెక్రటరీ పీసీ మోడీ, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.  అలాగే, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు బదులుగా ఆ పార్టీ నేత జైరాం రమేశ్ హాజరయ్యారు.  ఈ కార్యక్రమం తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీల కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి తన ఛాంబర్‌లోకి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని