Aryan Khan: ఆర్యన్‌ వచ్చేవరకు ఇంట్లో స్వీట్లు వండకూడదు.. గౌరీ ఆర్డర్‌

బాలీవుడ్ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎన్సీబీ కస్టడీలో ఉండి ఇప్పటికి రెండు వారాలు దాటింది. ముంబయిలోని క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన

Published : 20 Oct 2021 01:04 IST

ముంబయి: బాలీవుడ్ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఎన్సీబీ కస్టడీలో ఉండి ఇప్పటికి రెండు వారాలు దాటింది. ముంబయిలోని క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన అతడికి ఇంకా ఊరట లభించలేదు. ప్రస్తుతం ఆర్యన్‌ ఆర్థర్‌ రోడ్‌లోని సెంట్రల్‌ జైలులో ఉన్నాడు.కొడుకు జైల్లో ఉండటంతో షారూక్‌ కుటుంబం దిగాలుగా ఉంటోంది. అతడికి త్వరగా బెయిల్‌ రావాలని తల్లి గౌరీఖాన్‌ పూజలు చేస్తూనే ఉన్నారు. అంతేనా.. ఆర్యన్‌ తిరిగొచ్చేదాకా ఇంట్లో స్వీట్లు వండొద్దని గౌరీ తన వంట సిబ్బందికి ఆర్డర్‌ వేశారట. 

ఇటీవల షారూక్‌ నివాసం మన్నత్‌లో మధ్యాహ్న భోజనం కోసం వంట సిద్ధం చేస్తున్న సిబ్బంది ఖీర్‌ వండారు. దీన్ని గుర్తించిన గౌరీ వెంటనే కిచెన్‌లోకి వెళ్లి దాన్ని ఆపారు. ఆర్యన్‌ బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చేవరకు మన్నత్‌ కిచెన్‌లో ఎలాంటి స్వీట్లు వండటానికి వీల్లేదని గౌరీ ఆదేశించినట్లు షారూక్‌ సిబ్బంది ఒకరు మీడియాకు తెలిపారు. సాధారణంగా పండగ రోజుల్లో మన్నత్‌ వేడుకలతో కళకళలాడిపోయేది. అయితే ఇప్పుడు ఆర్యన్‌ జైల్లో ఉండటంతో షారూక్‌ కుటుంబం ఈ వేడుకలకు దూరంగా ఉంది. ఇటీవల నవరాత్రి రోజుల్లో గౌరీ తన కొడుకు కోసం నిరంతరం పూజలు చేశారని సదరు సిబ్బంది వెల్లడించారు. 

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అక్టోబరు 20న తీర్పు వెల్లడించే అవకాశాలున్నాయి. జైల్లో ఉన్న ఆర్యన్‌.. ఇటీవల షారూక్‌, గౌరీలతో కొంతసేపు వీడియో కాల్‌ మాట్లాడాడు. ఆ సమయంలో అతడు ఒకింత ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు జైల్లో ఆర్యన్‌కు అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే  పనులు చేయబోనని, చెడు మార్గంలో వెళ్లనని హామీ ఇచ్చాడు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని