Tamilnadu: న్యూ ఇయర్‌ వేడుకలకు బీచ్‌లు బంద్‌

కొవిడ్‌ కేసులు, ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా కొత్త సంవత్సరం వేడుకల వేళ డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో తమిళనాడులోని అన్ని బీచ్‌లను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ‘కొవిడ్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా డిసెంబర్ 31, జనవరి...

Published : 14 Dec 2021 23:46 IST

చెన్నై: కొవిడ్‌ కేసులు, ఒమిక్రాన్ కలవరం నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కొత్త సంవత్సరం వేడుకల వేళ డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో రాష్ట్రంలోని అన్ని బీచ్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ‘కొవిడ్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా డిసెంబర్ 31, జనవరి 1న రాష్ట్రంలోని అన్ని బీచ్‌లలో ప్రజలకు ప్రవేశం ఉండదు’ అని ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ పేరిట మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. సాధారణంగా న్యూ ఇయర్‌ సంబరాల సమయంలో చెన్నైలోని మెరీనా, బీసెంట్ నగర్ తదితర బీచ్‌లు భారీ జనసందోహంతో కిటకిటలాడుతుంటాయి.

విద్యాసంస్థలకు నిబంధనల సడలింపు..

రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి పరిస్థితులపై సీఎం నిన్న సమీక్షా సమావేశం నిర్వహించగా.. నేడు పలు ఉత్తర్వులు జారీ అయ్యాయి. బహిరంగ సమావేశాలపై ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను డిసెంబర్ 31 వరకూ పొడిగించారు. విద్యాసంస్థల విషయంలో కొన్ని సడలింపులు ప్రకటించారు. జనవరి 3 నుంచి 6- 12 తరగతులు, ఉన్నత విద్యాసంస్థల్లో రొటేషన్‌ విధానంలో కాకుండా.. రోజువారీ బోధనకు అనుమతించారు. రాబోయే పండగ సీజన్‌లో రద్దీని నివారించాలని, మాస్కుల వినియోగం, భౌతిక దూరం తదితర నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, టీకాలు వేయించుకోవాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని