భారత ఉత్పత్తులపై పాక్‌ కీలక నిర్ణయం

భారత ఉత్పత్తులపై పాక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకొనే విషయంపై 19 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్‌ బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జూన్‌ 30 నుంచి పత్తి, చక్కెరలను దిగుమతి

Updated : 24 Sep 2022 16:36 IST

 పత్తి, చక్కెర దిగుమతి చేసుకోనున్న పొరుగుదేశం

ఇస్లామాబాద్‌: భారత ఉత్పత్తులపై పాక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి పత్తి, చక్కెర దిగుమతి చేసుకొనే విషయంపై 19 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు పాక్‌ బుధవారం ప్రకటించింది. దీంతో ఈ ఏడాది జూన్‌ 30 నుంచి పత్తి, చక్కెరలను దిగుమతి చేసుకోనున్నట్లు కొత్తగా ఆ దేశ ఆర్థిక మంత్రిగా నియమితులైన హమద్‌ అజర్‌ తెలిపారు. ‘చక్కెర ధర భారత్‌లో తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఇండియా నుంచి అయిదు లక్షల టన్నుల చక్కెరను దిగుమతి చేసుకోవడానికి పాకిస్థాన్ ఎకనమిక్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ(ఈసీసీ) అనుమతి ఇచ్చింది. దీంతో ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. అదే విధంగా పత్తిని కూడా పాక్‌  దిగుమతి చేసుకోనుంది. ఈ చర్యతో  దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నేరుగా లబ్ధి చేకూరనుంది’ అని ఆర్థిక మంత్రి వివరించారు. 2019 ఆగస్టులో జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో భారత్‌, పాక్‌ల మధ్య వ్యాపార సంబంధాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని