IRCTC: ఇంత నూనెనా..! ‘వందే భారత్‌’లో ఆహార నాణ్యతపై వీడియో వైరల్‌

మోతాదుకు మించి నూనెతో కూడిన అల్పాహారాన్ని అందించారంటూ ఓ ‘వందే భారత్‌’ ప్రయాణికుడు చూపించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఐఆర్‌సీటీసీ స్పందించింది.

Published : 04 Feb 2023 18:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైళ్లను వరుసగా ప్రవేశపెడుతోన్న విషయం తెలిసిందే. వేగవంతమైన ప్రయాణంతోపాటు అత్యాధునిక సౌకర్యాల దృష్ట్యా ప్రయాణికులు ఈ రైళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, తాను ప్రయాణించిన వందే భారత్‌లో ఆహారం బాగోలేదని చూపుతోన్న ఓ ప్రయాణికుడి వీడియో తాజాగా నెట్టింట వైరల్‌(Viral Video)గా మారింది. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ రైలులో ఇది జరిగినట్లు తెలుస్తోంది.

వీడియోలో ఆ ప్రయాణికుడు తనకు అందించిన అల్పాహారంలో నూనె మోతాదు చాలా ఎక్కువగా ఉందని చూపించారు. ఈ వీడియో కాస్త ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. వందే భారత్‌లో ఆహార ధరలు ఎక్కువగా ఉన్నా.. నాణ్యత కొరవడిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఐఆర్‌సీటీసీ స్పందించింది. దిద్దుబాటు చర్యల కోసం సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు ట్విటర్‌ వేదికగా తెలిపింది. అంతకుముందు ఓ వందే భారత్‌ రైల్లో చెత్తా చెదారంతో నిండి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని