Putin: ఓపెన్‌ స్కైస్‌ ఒప్పందం నుంచి రష్యా బయటకు

రష్యా ఓపెన్‌స్కైస్‌ ట్రీటీ నుంచి బయటకు వచ్చేసినట్లు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఒప్పందం నుంచి

Published : 08 Jun 2021 01:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓపెన్‌స్కైస్‌ ఒప్పందం నుంచి బయటకు వచ్చేసినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఒప్పందం నుంచి బయటకు వచ్చే బిల్లుపై ఆయన సంతకం చేశారు. గత నెలలోనే అమెరికా కూడా ఈ ఒప్పందంలో మళ్లీ కొనసాగే ఆలోచన లేదని రష్యాకు వెల్లడించింది. బైడెన్‌ కంటే మందు అధ్యక్షుడిగా వ్యవహరించిన ట్రంప్‌ కూడా ఈ ఒప్పందంలో అమెరికా కొనసాగదని వెల్లడించారు. 

అమెరికా ఎన్నికల సమయంలో ఈ ఒప్పందం నుంచి వైదొలిగే విషయంలో ట్రంప్‌ను తప్పు పట్టారు. కానీ, తర్వాత బైడెన్‌ సర్కారు కూడా అదేబాట పట్టింది. తాజాగా పుతిన్‌ బిల్లుపై సంతకం చేయడంతో మరో ఆరు నెలల్లో రష్యా ఈ ఒప్పందం నుంచి బయటకు వెళ్లిపోవడం ఖాయమైంది. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అణ్వాయుధ మోహరింపులు, అనుమానాస్పద కార్యకలాపాలు సాగించకుండా విమానాల్లో నిఘా పెట్టడానికి కుదిరిన ఒప్పందం ఇది. 2002లో అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందం కారణంగా దాదాపు 1500 సార్లు విమానాలతో  ఇరు దేశాల గగనతలంలో సర్వేలు నిర్వహించారు. రష్యా ఈ ఒప్పంద నియమాలను ఉల్లంఘించిందని ట్రంప్‌ గతేడాది ఆరోపించారు. అనంతరం ఈ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని