Ramdev: సుప్రీంకోర్టుకు రామ్‌దేవ్‌ బాబా! 

అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తనపై నమోదైన కేసులపై యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలోని .....

Published : 23 Jun 2021 16:41 IST

దిల్లీ: అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తనపై నమోదైన కేసులపై యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశంలోని పలుచోట్ల నమోదైన కేసులను స్తంభింపజేయాలని కోరారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ కలిపి దిల్లీకి బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. 

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో అల్లోపతి ఔషధాల సామర్థ్యంపై రామ్‌ దేవ్‌బాబా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘అల్లోపతి పనికిమాలిన వైద్యం’ అని పేర్కొంటూ గత నెలలో చేసిన వ్యాఖ్యలతో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్‌ అయింది. దీంతో ఆయన తీరుపట్ల  భారత వైద్య సంఘం (ఐఎంఏ) తీవ్రస్థాయిలో మండిపడింది. దేశంలోని పలుచోట్ల ఐఎంఏ శాఖలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 15 రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఐఎంఏ ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. లేకపోతే రూ.1000 కోట్లు పరువు నష్టం దావావేస్తామని కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ కలుగజేసుకోవడంతో బాబా రామ్‌ దేవ్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని