Remdesivir: ఏపీ, తెలంగాణకు ఎన్నంటే?

రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ కేటాయింపుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్‌ 21 నుంచి మే 23 వరకు కేటాయింపుల వివరాలను తెలిపింది.

Published : 16 May 2021 18:30 IST

దిల్లీ: రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ కేటాయింపుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏప్రిల్‌ 21 నుంచి మే 23 వరకు కేటాయింపుల వివరాలను తెలిపింది. రాష్ట్రాలకు 76లక్షల ఇంజక్షన్లను ఇస్తున్నట్లు వివరించింది. మహారాష్ట్రకు అత్యధికంగా 14.92లక్షలు, కర్ణాటకకు 10లక్షలు, ఉత్తర్‌ప్రదేశ్‌కు 6.25లక్షలు, గుజరాత్‌కు 5.10లక్షలు, రాజస్థాన్‌కు 3.76లక్షలు, ఏపీకి 3.75లక్షలు, తెలంగాణకు 2.15లక్షలు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా రోగులకు అందించే చికిత్సలో రెమ్‌డెసివిర్‌ను వాడుతున్నారు. పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నవారికి దీన్ని ఉపయోగిస్తున్నారు. 

రాష్ట్రాల వారీగా కేటాయింపుల వివరాలు..


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని