జాతీయ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి

దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి....

Updated : 26 Jan 2021 12:58 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల దృష్ట్యా దిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు అంజలి ఘటించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి జాతీయ యుద్ధ స్మారకం వద్దకు వచ్చిన మోదీకి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి.

 

 

ఇవీ చదవండి...

రఫేల్‌.. రామమందిరం..గణతంత్ర విశేషాలు!

సారీ ఇండియా.. రాలేకపోయాను!
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని