PM Modi: ప్రధానిపై ‘బంగారు’ అభిమానం.. ఆకట్టుకుంటోన్న మోదీ స్వర్ణ విగ్రహం

ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పట్ల అభిమానాన్ని ఓ స్వర్ణకారుడు  వినూత్నంగా చాటుకున్నాడు. 156గ్రాముల పసిడి విగ్రహాన్ని తయారు చేసి బాంబే గోల్డ్‌ ఎగ్జిబిషన్‌లో ఉంచగా.. ఆ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.

Updated : 20 Jan 2023 19:16 IST

ముంబయి: ఎవరి మీదైనా చెప్పలేనంత అభిమానం ఉంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వ్యక్తపరుస్తుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో స్వర్ణకారుడు. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన సందీప్‌ జైన్‌(sandeep jain) 156 గ్రాముల మేలిమి పసిడితో ప్రధాని విగ్రహాన్ని(Modi Golden statue) అద్భుతంగా మలిచాడు. ఇటీవల జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 156సీట్లతో భాజపా చారిత్రక విజయానికి గుర్తుగా 156 గ్రాముల బంగారంతో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించాడు. దాదాపు 15 నుంచి 20మంది కళాకారులు కొన్ని రోజుల పాటు శ్రమించి రూపొందించిన ఈ విగ్రహాన్ని ఇటీవల బాంబే గోల్డ్‌ ఎగ్జిబిషన్‌(Bombay gold exhibition)లో ఉంచగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌(Viral)గా మారింది. ఈ విగ్రహం తయారీకి దాదాపు రూ.11లక్షల వ్యయం చేసినట్టు సమాచారం. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని