తమిళనాడులో లాక్‌డౌన్‌ పొడిగింపు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. తమిళనాడులోనూ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని గతంలో ప్రకటించిన స్టాలిన్‌ ప్రభుత్వం తాజాగా నిర్ణయం...

Published : 02 Jul 2021 22:56 IST

చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నాయి. తమిళనాడులోనూ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని గతంలో ప్రకటించిన స్టాలిన్‌ ప్రభుత్వం తాజాగా నిర్ణయం మార్చుకుంది. కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నందు వల్ల జులై 12 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.

తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలు సడలించింది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 50 శాతం సామర్థ్యంలో హోటళ్లు నిర్వహించుకునేందుకు అనుమతిచ్చింది. లాడ్జ్‌లు, గెస్ట్‌హౌస్‌లు కూడా తెరచుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు సాగించుకోవచ్చు. సినిమా థియేటర్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, కళాశాలు, జంతుప్రదర్శన శాలలు తెరవడానికి వీల్లేదు.

వైరస్‌ తీవ్రతను బట్టి మొత్తం 38 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. ఉద్ధృతి ఎక్కువగా ఉన్న 11 జిల్లాలను మొదటి కేటగిరీగానూ, వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉన్న 23 జిల్లాలను రెండో కేటగిరీగానూ, రికవరీ రేటు మెరుగ్గా ఉన్న 4 జిల్లాలను మూడో కేటగిరీగా విభజించి ఆంక్షలు అమలు చేసింది. అయితే ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఒకే రకమైన ఆంక్షలు ఉంటాయని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని