Jallikattu: జల్లికట్టుకు పచ్చజెండా.. నిబంధనలు తప్పనిసరి

స్థానికంగా ఏటా నిర్వహించే సాంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’కు తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది కొన్ని పరిమితులతో అనుమతి ఇచ్చింది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో.. తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం మార్గదర్శకాలు...

Updated : 11 Jan 2022 12:56 IST

చెన్నై: స్థానికంగా ఏటా నిర్వహించే సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’కు తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది కొన్ని పరిమితులతో అనుమతి ఇచ్చింది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం.. పోటీలో పాల్గొనేందుకు 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగాలు వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనున్నాయి. అదే విధంగా తమిళంలో ‘ఎరుతు విడుతల్’గా పిలిచే బుల్‌ రేసింగ్‌లో 150 మంది పాల్గొనవచ్చు.

జల్లికట్టులో పాల్గొనేవారు, నిర్వాహకులు, ప్రేక్షకులు రెండు డోసులు తీసుకుని ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. దీంతోపాటు గడచిన 48 గంటల వ్యవధిలో చేయించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసింది. అలాగే పోటీలను తిలకించేందుకు బహిరంగ ప్రదేశాల్లో 150 మంది ప్రేక్షకులు, లేదా సిటింగ్ కెపాసిటీలో 50 శాతం మందికి అనుమతి ఇచ్చింది. క్రీడల నిర్వహణకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, జంతు చట్టాలతోపాటు మహమ్మారి సంబంధిత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. మధురై జిల్లాలో ఈ నెల 14 నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని