Afghan Crisis: అఫ్గాన్‌ పరిణామాలపై కేంద్రం అఖిలపక్ష సమావేశం

అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్‌ సహా ఇతర ప్రధాన పార్టీల నేతలు..

Updated : 26 Aug 2021 14:26 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్‌ సహా ఇతర ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. వైకాపా నుంచి మిథున్‌రెడ్డి, తెదేపా తరఫున గల్లా జయదేవ్‌, తెరాస నుంచి నామా నాగేశ్వరరావు  సమావేశంలో పాల్గొన్నారు. అఫ్గాన్‌ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న చర్యలు సహా ఇతర అంశాలను విదేశాంగ మంత్రి జైశంకర్‌ నేతలకు వివరించనున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని