వాట్సాప్‌ డౌన్‌.. ట్విటర్‌ను ముంచెత్తుతున్న మీమ్స్‌ 

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌లు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు సాంకేతిక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. భారత్‌ సహా పలు దేశాల్లో వీటి సేవలకు అంతరాయమేర్పడింది. ఆండ్రాయిడ్‌తో పాటు ...

Updated : 05 Oct 2021 06:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌లు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు సాంకేతిక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయాయి. భారత్‌ సహా పలు దేశాల్లో వీటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్‌ వినియోగదారులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సందేశాలు పంపించడానికి వీలు లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏం జరిగిందో తెలియక వినియోగదారులు పలువురికి ఫోన్‌ చేసి తెలుసుకుంటున్నారు. సందేశాలు, ఫొటోలు, వీడియోలు వెళ్లకపోవడంతో తొలుత పలువురు తమ మొబైల్‌ నెట్‌వర్క్‌, వైఫై పనిచేయక పోవడమే కారణమని భావించారు. ట్విటర్‌ వేదికగా ఎప్పుడైతే ఫిర్యాదులు వచ్చాయో ఇది సాంకేతిక సమస్య అని తెలుసుకున్నారు. దీనిపై నెటిజెన్స్‌ మీమ్స్‌ కూడా రూపొందించారు. ‘వాట్సాప్‌కు ఏమైందో తెలియాలంటే ట్విటర్‌లోకి వెళ్లాలి పదండి’ అంటూ ఫన్నీ మీమ్స్‌ను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు నెటిజన్లు. 

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని