India Corona Update: హమ్మయ్య.. 35వేలకు కొత్తకేసులు

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కొత్తకేసులే ఎక్కువగా నమోదవుతుండగా.. తాజాగా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం కాస్త ఊరటినిస్తోంది. ఇక క్రితం రోజుతో పోలిస్తే

Updated : 23 Jul 2021 10:55 IST

500 దిగువకు మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండగా.. తాజాగా కోలుకున్నవారి సంఖ్యే అధికంగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. ఇక ముందు రోజు(41 వేల కేసులు)తో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. తాజాగా 35వేల కేసులు వెలుగు చూడగా.. మరణాలు కూడా 500లోపే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి.

* గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.68లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 35,342 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లు దాటింది.

* ఇక ఇదే సమయంలో 38,740 మంది కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 3,04,68,079కు చేరింది. రికవరీ రేటు 97.35శాతంగా ఉంది.

* 24 గంటల వ్యవధిలో మరో 483 మంది వైరస్‌కు బలయ్యారు. మరణాల రేటు 1.34శాతంగా ఉంది. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,19,470 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

*  యాక్టివ్‌ కేసుల సంఖ్య 4లక్షల పైనే ఉంటోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,513 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.31శాతానికి చేరింది.

* ఇక దేశంలో మొత్తం టీకాలు అందుకున్నవారి సంఖ్య 42 కోట్లు దాటింది.  గురువారం 54.76లక్షల మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 42,34,17,030 మందికి వ్యాక్సిన్‌ వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని