Delta Plus: మహారాష్ట్రలో పెరిగిన డెల్టా ప్లస్ కేసులు

మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు 45కి పెరిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడించారు. ‘మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు 21 నుంచి 45కి పెరిగాయి. వారిలో 27 మంది పురుషులు కాగా, 18 మంది స్త్రీలు. వారి ఆరోగ్య పరిస్థితి, పర్యటించిన ప్రాంతాలు, సన్నిహితుల గురించిన వివరాలు సేకరిస్తున్నాం. అలాగే వారు టీకా తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకైతే ఎవరి పరిస్థితి ఆందోళనకరంగా లేదు’ అని తోపే మీడియాకు వెల్లడించారు.

Published : 09 Aug 2021 14:45 IST

21 నుంచి 45కి చేరిన బాధితులు..

ముంబయి: మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు 45కి పెరిగినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడించారు. ‘మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు 21 నుంచి 45కి పెరిగాయి. వారిలో 27 మంది పురుషులు కాగా, 18 మంది స్త్రీలు. వారి ఆరోగ్య పరిస్థితి, పర్యటించిన ప్రాంతాలు, సన్నిహితుల గురించిన వివరాలు సేకరిస్తున్నాం. అలాగే వారు టీకా తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకైతే ఎవరి పరిస్థితి ఆందోళనకరంగా లేదు’ అని తోపే మీడియాకు వెల్లడించారు.

డెల్టా వేరియంట్‌ నుంచి రూపాంతరం చెందిందే డెల్టా ప్లస్. ఇది కరోనా రెండో దశ వేళ మహారాష్ట్రలో వెలుగుచూసింది. దీనిని ఆందోళనకర వేరియంట్‌గా జూన్‌లో కేంద్రం ప్రకటించింది. 18 సంవత్సరాల లోపువారిలో కూడా ఈ వేరియంట్ బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలో రోజువారీ కేసులు 5వేలకుపైనే వెలుగుచూస్తున్నాయి. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. కేసులు పెరిగితే లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందన్నారు. అలాగే మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని