Texas: గర్భస్త్రావంపై పరిమితులు.. మహిళల నిరసన

గర్భస్రావంపై పరిమితులు విధిస్తూ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురావడం పట్ల ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.....

Published : 04 Oct 2021 01:07 IST

టెక్సాస్‌: గర్భస్రావంపై పరిమితులు విధిస్తూ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురావడం పట్ల ఆ దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. 50 రాష్ట్రాల్లో మహిళలు పోరుబాట పట్టారు. నిరసన ప్రదర్శనల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ తరహా చట్టాల కారణంగా రాజ్యాంగపరమైన హక్కులకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది మహిళలు రోడ్లపైకి చేరి ప్లకార్డులు చేతబూని ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

టెక్సాస్‌లో సెప్టెంబర్ 1 నుంచి అబార్షన్ హక్కును రద్దు చేశారు. కడుపులో బిడ్డ గుండె కొట్టుకోవడం ప్రారంభించిన తరువాత గర్భస్రావం చేయించుకోకూడదని అక్కడ చట్టం తీసుకువచ్చారు. నిబంధనలు అతిక్రమించి వైద్యులు, లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా అబార్షన్‌ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. అయితే ఈ చట్టం వివాదాస్పదంగా మారింది. ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ యూఎస్‌ సుప్రీంకోర్టులో అనేక మంది పిటిషన్లు వేశారు. కాగా ఆ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. మిస్సిస్సిపీ రాష్ట్రంలో 15 వారాల తరువాత అబార్షన్ చేయించుకోకూడదనే చట్టం ఉంది. దానిపై డిసెంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని