Trump: ట్రంప్‌నకు నష్టం.. హోటళ్ల విక్రయం..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ కుటుంబానికి చోందిన భారీ హోటళ్లను విక్రయించేస్తున్నారు. తాజాగా

Updated : 15 Nov 2021 12:44 IST

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబానికి చెందిన భారీ హోటళ్లను విక్రయించేస్తున్నారు. తాజాగా వాషింగ్టన్‌లోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌ను విక్రయించేందుకు డీల్‌ కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో ఈ హోటల్‌ పేరు వాలడ్రోఫ్‌ ఆస్టోరిగా మారనుంది. దీనిని హిల్టన్‌ గ్రూప్‌ నిర్వహించనుంది. 263 గదులున్న ఈ భవనాన్ని ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 60 ఏళ్ల లీజుకు తీసుకొంది. 2016లో ఈ హోటల్‌ కార్యకలాపాలను ప్రారంభించింది. వాస్తవానికి రిపబ్లికన్లకు ఇది కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచినా.. ఇటీవల కరోనా వ్యాప్తి కారణంగా భారీగా నష్టాలు వచ్చాయి. మొత్తం నష్టం 70 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని ఇటీవల బయటపడింది. 2019 నుంచే దీన్ని విక్రయించాలని నిర్ణయించినా.. బయ్యర్లు లభించలేదు.

తాజాగా మియామీకి చెందిన సీజీఐ మర్చంట్‌ గ్రూప్‌ దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి ఈ డీల్‌ పూర్తికావచ్చని వాల్‌ స్ట్రీట్‌ పేర్కొంది. శ్వేత సౌధానికి ఒక్క మైలు దూరంలోని పెన్సెల్వేనియా అవెన్యూలోని పోస్టాఫీస్‌ భవనం ఈ హోటల్‌గా మారింది. 2012లో దీనిని అభివృద్ధి చేసేందుకు అంగీకారం కుదిరింది. 2016లో ట్రంప్‌ నామినేషన్‌ వేసిన కొన్ని వారాల్లో ఈ హోటల్‌ పనిచేయడం మొదలైంది. ఇటీవల ట్రంప్‌ తన హోటల్‌ వ్యాపార లాభాల్ని బాగా ఎక్కువ చేసి 150 మిలియన్‌ డాలర్లుగా చూపినట్లు  తేలింది. వాస్తవానికి దీనిపై అమెరికా కాంగ్రెస్‌ దర్యాప్తు చేపట్టి 70 మిలియన్‌ డాలర్లు నష్టం వచ్చినట్లుగా తేల్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని