రైతుల ఆందోళనపై కేంద్రమంత్రుల సమావేశం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు భారీ ఎత్తున ఉద్యమిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు...

Published : 30 Nov 2020 03:40 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు భారీ ఎత్తున ఉద్యమిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ పాల్గొన్నారు. మరోవైపు డిసెంబర్‌ 3న రైతు సంఘాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. కాగా ముందస్తు చర్చలపై కేంద్ర ప్రతిపాదనను రైతులు తిరస్కరించడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అనే అంశాలపై కేంద్ర మంత్రులు చర్చించినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని