UP election 2022: యూపీలో కొనసాగుతోన్న నాలుగో విడత పోలింగ్‌

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ బుధవారం కొనసాగుతోంది. ఈ దశలో మొత్తం 59 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరుగుతుండగా.. లఖ్‌నవూ

Updated : 23 Feb 2022 16:05 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ బుధవారం కొనసాగుతోంది. ఈ దశలో మొత్తం 59 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరుగుతుండగా.. లఖ్‌నవూ, లఖింపుర్‌ ఖేరీ, రాయ్‌బరేలీ వంటి కీలక స్థానాలున్నాయి. 2.3కోట్ల మంది ఓటర్లు 624 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి రెండు గంటల్లో అంటే ఉదయం 9 గంటల సమయానికి 9.10శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఈవీఎం సమస్యలు తలెత్తాయి. ఉన్నావ్‌లోని సోహ్రామౌ ప్రాంతంలో ఈవీఎంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓటింగ్‌ ఆలస్యంగా మొదలైంది.

ఓటేసిన ప్రముఖులు..

తొలి గంటల్లో పలువురు ప్రముఖులు, ఎన్నికల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆయన కుమారుడు పంకజ్‌ లఖ్‌నవూలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. లఖ్‌నవూలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓటు వేశారు. భాజపా ఎంపీ సాక్షి మహరాజ్‌ ఉన్నావ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని