Politics: సీఎం ఇంటి  వద్ద ధర్నా..!

పంజాబ్‌లో విద్యుత్‌ కొరత రగడ రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్‌ఆద్మీ పార్టీ దీనిని అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తోంది.  విద్యుత్‌ కొరతనను నిరసిస్తూ పంజాబ్‌ ఆప్‌ చీఫ్‌ భగవంత్‌ మన్‌ నేతృత్వంలో...

Updated : 03 Jul 2021 19:07 IST

చండీగఢ్: పంజాబ్‌లో విద్యుత్‌ కొరత రగడ రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్‌ఆద్మీ పార్టీ దీనిని అనుకూలంగా మార్చుకునేందుకు యత్నిస్తోంది.  విద్యుత్‌ కొరతను నిరసిస్తూ పంజాబ్‌ ఆప్‌ చీఫ్‌ భగవంత్‌ మాన్‌ నేతృత్వంలో వందలాది మంది ఆప్‌ కార్యకర్తలు ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌  నివాస సమీపంలో ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం ఇంటి వైపు ర్యాలీగా వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు జలఫిరంగులు ప్రయోగించాల్సి వచ్చింది.

గత కొంత కాలంగా పంజాబ్‌ తీవ్ర విద్యుత్‌ కొరతను ఎదుర్కొంటోంది. రోజుకు సగటున 14,000 మెగావాట్ల విద్యుత్‌ వినియోగమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పని గంటలను కుదిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అధిక విద్యుత్‌ వినియోగించే ఏసీ లాంటి ఎలక్ట్రిక్‌ పరికరాలను వాడొద్దని కోరింది. రానున్న ఎన్నికల్లో విద్యుత్‌ కొరతనే ప్రధాన అస్త్రంగా మలచుకొని అధికార కాంగ్రెస్‌ను గద్దె దించాలని ఆప్‌ ఆశిస్తోంది. తాము అధికారంలోకి వస్తే గృహావసరాల కోసం 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని ఇటీవల అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని