పాక్‌.. భారత్‌ను ఎందుకు విభజించాలనుకుంటున్నావ్‌?: రాజ్‌నాథ్‌ సింగ్‌

పాకిస్థాన్‌పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. భారత్‌ జోలికి వస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరించారు. ఇవాళ మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో పర్యటిస్తున్న ఆయన.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలువురు భారత చక్రవర్తుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా

Published : 25 Dec 2021 01:27 IST

ముంబయి: పాకిస్థాన్‌పై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి విరుచుకుపడ్డారు. భారత్‌ జోలికి వస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరించారు. శుక్రవారం మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలువురు భారత చక్రవర్తుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ గురించి ప్రస్తావించారు. భారత్‌ను ఎందుకు అస్థిర పర్చాలని, విభజించాలని చూస్తుందో నేరుగా పాక్‌నే ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ‘గతంలో ఎయిర్‌స్ట్రైక్‌, సర్జికల్‌ స్ట్రైక్‌ లేవు. కానీ, మేం చేసి చూపించాం. భారత భూభాగంలోనే కాదు.. సరిహద్దు దాటైనా సరే ఉగ్రవాదులను మట్టుబెడతామని పాక్‌కు గట్టి సందేశాన్ని ఇచ్చాం’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తుచేశారు.

దేశ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ.. నేతల మాటలు, చేతల మధ్య తేడాలు ఉండటంతో ప్రజలు వారిని విశ్వసించడం మానేస్తున్నారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. భాజపా ప్రభుత్వం దీన్ని ఒక సవాలుగా తీసుకుందని, ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితులు రాకుండా చేస్తామని చెప్పారు. తాము ఏం చెబుతామో.. అది చేసి చూపిస్తామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని