PM Modi: ‘థాంక్యూ కోచి’.. కేరళలో ప్రధాని మోదీ రోడ్ షో
యువత ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోదీ (PM Narendra Modi) అన్నారు. భాజపా, దేశ యువత ఒకే విధంగా ఆలోచిస్తున్నాయని చెప్పారు.
కోచి: రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కేరళలోని కోచికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్ షో నిర్వహించారు. రెండు కిలోమీటర్లు సాగిన ఈ రోడ్ షోలో కేరళ సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న ప్రధానిని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొంతదూరం ప్రయాణించిన తర్వాత ప్రధాని కాన్వాయ్ దిగి కాలినడకన ముందుకు సాగారు. సుమారు 15 నిమిషాలపాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రధాని నడుచుకుంటూ వెళ్తుంటే ఇరువైపులా భాజపా శ్రేణులు ఆయనపై పూల వర్షం కురింపిచారు. ప్రధాని మోదీ రాక కేరళ భాజపా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాం నింపింది.
అనంతరం ప్రధాని కోచిలో యువమ్ 2023 (Yuvam 2023) యూత్ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించారు. ప్రపచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను యువశక్తి నడిపిస్తోందని అన్నారు. ‘‘21వ శతాబ్దం భారత శతాబ్దంగా ప్రతిఒక్కరు చెబుతున్నారు. దేశానికి యువత గొప్ప శక్తి. భాజపా, దేశ యువత ఒకే విధంగా ఆలోచిస్తున్నాయి. మేం సంస్కరణలు తెస్తే, యువత ఫలితాలను తీసుకొస్తుంది. భారత్ ప్రపంచలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అవతరించడానికి యువతే కారణం. గతంలో భారత్‌ను మార్చలేం అనేవారు. కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని మార్చగలిగే సత్తా భారత్‌కు ఉంది’’ అని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు అవినీతికి మారుపేరుగా నిలిచాయని, కేరళ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. ‘‘రెండు సిద్ధాంతాల కారణంగా కేరళ ఎంతో నష్టపోయింది. ఒకటి కేరళ ప్రయోజనాల కంటే పార్టీకి పెద్ద పీట వేసింది. మరొకటి ఒక కుటుంబాన్ని అందలం ఎక్కించేందుకు పనిచేస్తుంది. ఆ రెండు పార్టీలూ హింస, అవినీతిని ప్రోత్సహిస్తున్నాయి. వాటిని ఓడించేందుకు కేరళ యువత తీవ్రంగా కృషి చేయాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువత ప్రాధాన్యాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర భద్రతా బలగాల నియామకాల కోసం నిర్వహించే రాత పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించడమే అందుకు నిదర్శనమని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ODI WC 2023: భారత స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థులు జాగ్రత్త: పాక్ మాజీ కెప్టెన్
-
UGC NET 2023: యూజీసీ నెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
-
Elections: అభ్యర్థుల నేర చరిత్రను.. పత్రికా ప్రకటనల్లో వెల్లడించాలి : ఎన్నికల సంఘం
-
World Culture Festival: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం 180 దేశాల ప్రజల ప్రార్థన
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు