Raja Vikramarka: నా రెండో సినిమా అనుకుని చేశా!
సుధాకర్ కోమాకుల అంటే గుర్తు పడతారో లేదో కానీ... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నాగరాజ్ అంటే ఆయన రూపం కళ్ల ముందు మెదులుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రంతోనే పరిచయమైన సుధాకర్ కోమాకుల...
సుధాకర్ కోమాకుల అంటే గుర్తు పడతారో లేదో కానీ... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ నాగరాజ్ అంటే ఆయన రూపం కళ్ల ముందు మెదులుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ చిత్రంతోనే పరిచయమైన సుధాకర్ కోమాకుల... ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తూనే, అప్పుడప్పుడు కీలక పాత్రల్లోనూ మెరుస్తున్నారు. ‘క్రాక్’లో పోలీస్ కానిస్టేబుల్‌గా సందడి చేసిన సుధాకర్... ఇటీవల ‘రాజా విక్రమార్క’లోనూ నటించారు. కార్తికేయ కథానాయకుడిగా నటించిన ‘రాజా విక్రమార్క’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధాకర్ కోమాకుల బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘తొలి దాంతోపాటు రెండు మూడు సినిమాలూ కీలకమే. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తర్వాత నేను మంచి కథలే ఎంచుకున్నా అవి ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయాయి. ‘రాజా విక్రమార్క’ నాకు పునః ప్రారంభం అనుకుంటున్నా. ఇది నా రెండో సినిమా అనుకుని చేశా. ఇందులో ఏసీపీ గోవింద్ అనే ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తా. నేనెక్కువగా సరదా పాత్రలే చేశా. ఇందులో గోవింద్ పాత్ర చాలా గంభీరంగా ఉంటుంది. ఆ పాత్రలో భిన్న కోణాలు ఉన్నాయి. సినిమా తర్వాత తప్పకుండా నాకు మంచి పేరొస్తుంది. ఇందులో నేను నటించడానికి కారణం దర్శకుడు శ్రీ సరిపల్లి. తను నాకు పదేళ్లుగా తెలుసు. అమెరికాలో చాలా సినిమాలకి పనిచేశాడు. నేను ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చేసేటప్పుడు తను సహాయ దర్శకుడిగా చేసేవాడు. ఆ తర్వాత నా సినిమా ‘నువ్వు తోపురా’కి చీఫ్ అసోసియేట్ దర్శకుడిగా పనిచేశారు. తను కార్తికేయకి కథ చెప్పి ఒప్పించాక నాకు ఫోన్ చేసిన ‘నువ్వు ఓ కీలక పాత్ర చేయాలి’ అన్నాడు. నేను హీరోగా సినిమాలు చేస్తున్నాను కదా అంటే, ‘మంచి పాత్ర, నువ్వు చేయాల్సిందే’ అన్నాడు. అలా ‘క్రాక్’ కంటే ముందే ఒప్పుకొని చేసిన సినిమా ఇది’’.
* ‘‘హీరోగా నా ఆకలి ఇంకా తీరలేదు. ఇక నుంచి హీరోగా ఎక్కువ మంచి సినిమాలు చేయాలనుకుంటున్నా. నా పుట్టినరోజున ఈ సినిమా విడుదలవుతోంది. ప్రస్తుతం కథానాయకుడిగా ‘నారాయణ అండ్ కో’, ‘జీడీ’ (గుండెల్లో దమ్ముంటే) అనే సినిమాలు చేస్తున్నా. వీటితోపాటు మరో సినిమా ఖరారైంది. సుఖ మీడియా పేరుతో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశా. మంచి కథలు వస్తే మా భాగస్వామ్యంలో నిర్మించాలనేది ప్రణాళిక. చిరంజీవి సర్ పుట్టినరోజు సందర్భంగా నేను, నా భార్య హారిక కలిసి చేసిన ‘ఇందువదన...’ పాటకి చక్కటి స్పందన లభించింది. ఆ తరహాలో ‘30 వెడ్స్ 21’ ఫేమ్ అనన్యతో కలిసి ఓ ఇండిపెండెంట్ గీతం చేశా. అది త్వరలోనే విడుదలవుతుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
చిట్టిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్రవేసుకుంది నటి ఫరియా అబ్దుల్లా. అమాయకమైన చూపులతోనూ నటనతోనూ ఆకట్టుకుంటున్న ఈ హైదరాబాదీ అమ్మాయి ‘ఆ ఒక్కటీ అడక్కు’లోని సిద్ధి పాత్రతో నవ్వులు పంచేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్‌ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు