అతను దొరక్కపోతే సింగిల్‌గానే ఉంటా: త్రిష

దక్షిణాదికి చెందిన అగ్ర, యువ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చెన్నై ముద్దుగుమ్మ త్రిష. ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అందాల రాశి పెళ్లి గురించి ప్రతిఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆమె పెళ్లి....

Published : 18 Nov 2020 12:17 IST

పెళ్లిపై నటి వ్యాఖ్యలు

హైదరాబాద్‌: దక్షిణాదికి చెందిన అగ్ర, యువ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చెన్నై ముద్దుగుమ్మ త్రిష. ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అందాల రాశి పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆమె పెళ్లి కబురు చెప్పనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా త్రిష.. తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని వెల్లడించారు.

‘అన్ని విషయాల్లో నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమ వివాహమే. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా వివాహ బంధంలోకి అడుగుపెడతాను. అప్పటివరకూ సింగిల్‌గా ఉండడానికి ఇబ్బంది లేదు. ఒకవేళ సరైన జీవిత భాగస్వామి దొరక్కపోతే ఎలాంటి బాధా లేకుండా ఎప్పటికీ సింగిల్‌గానే ఉండగలను’ అని త్రిష తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కోలీవుడ్‌కు చెందిన ఓ నిర్మాతను వివాహం చేసుకోవాలని త్రిష భావించారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయారు. అనంతరం ఆమె వృత్తి జీవితంలో బిజీ అయ్యారు. అయితే, తమిళ నటుడు శింబుని త్రిష పెళ్లి చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజులగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి శింబు తండ్రి టి.రాజేందర్‌ని అడగ్గా ఆయన స్పందించకపోవడంతో పెళ్లి వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని