Jayamma Panchayathi: వచ్చే నెలలోనే... ‘జయమ్మ పంచాయతీ’

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్ర ధారిగా... విజయ్‌కుమార్‌ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్నారు.

Updated : 15 Mar 2022 11:42 IST

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్ర ధారిగా... విజయ్‌కుమార్‌ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జయమ్మ పంచాయతీ’. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఓ వీడియో ద్వారా సోమవారం ప్రకటించాయి చిత్రవర్గాలు. ‘‘పల్లెటూరి డ్రామాతో రూపొందిన చిత్రమిది. ఎవరికీ... దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా  సుమ నటించింది. రామ్‌చరణ్‌ విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కీ, నాని విడుదల చేసిన తొలి పాటకి, రానా దగ్గుబాటి విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన లభించింది రాజమౌళి చేతులమీదుగా టైటిల్‌ సాంగ్‌  విడుదలైంది. తప్పకుండా చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి, ఛాయాగ్రహణం: అనూష్‌కుమార్‌, కూర్పు: రవితేజ గిరిజాల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని