ఆయన మాట్లాడిన తీరు చాలా తప్పు: నరేష్‌

కన్నడ ప్రముఖ నటుడు విష్ణువర్ధన్‌పై తెలుగు నటుడు విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (‘మా’) అధ్యక్షుడు, నటుడు నరేష్‌ తీవ్రంగా ఖండించారు. కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. లెజెండరీ నటుడ్ని దూషించడం, అసభ్యపదజాలం వాడటం సరికాదని పేర్కొన్నారు.....

Published : 14 Dec 2020 01:53 IST

నటుడిగా నన్నెంతో బాధించింది..

హైదరాబాద్‌: కన్నడ ప్రముఖ నటుడు విష్ణువర్ధన్‌పై తెలుగు నటుడు విజయ రంగరాజు చేసిన వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (‘మా’) అధ్యక్షుడు, నటుడు నరేష్‌ తీవ్రంగా ఖండించారు. కన్నడ ప్రజలకు క్షమాపణలు తెలిపారు. లెజెండరీ నటుడ్ని దూషించడం, అసభ్యపదజాలం వాడటం సరికాదని పేర్కొన్నారు. ఐకమత్యంగా ఉంటూ ఒకర్నొకరం గౌరవించుకుందామని పిలుపునిచ్చారు. ‘మన నటుడు విజయ రంగరాజు కన్నడ ఆరాధ్య దైవం, దివంగత నటుడు విష్ణువర్ధన్‌ను ఏక వచనంతో, అనకూడని మాటలు అన్నారు. నటుడిగా నన్ను ఇది ఎంతో బాధించింది. కోట్లాది ప్రజల అభిమానం పొందిన ఓ కళాకారుడి గురించి అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలా జరిగినందుకు బాధపడుతున్నా. ఇవి విజయ రంగరాజు వ్యక్తిగత ఆలోచనలు అయినప్పటికీ మాట్లాడిన, చెప్పిన తీరు చాలా తప్పు. నేను విష్ణువర్ధన్‌ని చిన్నతనం నుంచి చూసి, అభిమానించి పెరిగా. ఇటువంటివి మళ్లీ జరగకూడదని ప్రార్థిస్తున్నా. విజయరంగరాజుతో నేను మాట్లాడతాను’ అని నరేష్‌ చెప్పారు.

విజయ రంగరాజు ఓ ఇంటర్వ్యూలో చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయనపై కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు యశ్‌, సుదీప్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, సుమలత తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానులు సైతం తీవ్ర విమర్శలు గుప్పించడంతో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తను చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాల మన్నించమని కోరుతూ మధ్య విజయ రంగరాజు వీడియో విడుదల చేశారు.
ఇవీ చదవండి..
టాలీవుడ్‌ నటుడిపై కన్నడ స్టార్స్‌ ఆగ్రహం
‘బెస్ట్‌ ఆఫ్‌ కేజీఎఫ్‌’ చూశారా..?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని